ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాల మాన్సాస్‌!

ABN, First Publish Date - 2020-03-08T10:36:53+05:30

వివాదాల మాన్సాస్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతులతో ‘నాలుగు స్తంభాలాట’

అశోక్‌ ఉద్వాసనపై మాట్లాడలేని స్థితి

సంచయిత మతంపైనా చర్చ

సోషల్‌ మీడియాలో చర్చిల్లో దిగిన ఫొటోలు

(విజయనగరం/అమరావతి - ఆంధ్రజ్యోతి)


ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన ‘మాన్సాస్‌’ ట్రస్టును రాష్ట్ర సర్కారు వివాదాలకు కేంద్రంగా మార్చింది. టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచయితను మాన్సా్‌సతోపాటు సింహాచలం దేవస్థానం బోర్డు సారథిగా నియమిస్తూ అర్ధరాత్రి రహస్య జీవోలు జారీ చేయడమే ఒక వివాదం! ఇప్పుడు... సంచయిత ‘మతం’పైనా చర్చ మొదలైంది. అశోక్‌ గజపతిరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ అంశంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు ఏ మతమో నాకు తెలియదు. ఇతర మతాలకు చెందినవారు సింహాచలం దేవస్థానం బోర్డు, మాన్సా్‌సకు అధిపతులైతే సమస్యలు వస్తాయి’’ అన్నారు. ఇక... సంచయిత, ఆమె తల్లి ఉమా గజపతి గతంలో వాటికన్‌ సిటీ చర్చిలో దిగిన ఫొటోలు, క్రిస్మస్‌ సంబరాల్లో పాల్గొన్న చిత్రాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నిజానికి, ఈ ఫొటోలు గతంలో సంచయిత స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినవే. 


ఆ నలుగురు ఎందుకు?

మాన్సాస్‌ కొత్త ట్రస్టు కూర్పుపైనా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గజపతిరాజుల కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు వ్యూహాత్మకంగా సభ్యుల ఎంపిక జరిగిందని భావిస్తున్నారు. గతంలో ట్రస్టుకు అశోక్‌ గజపతి చైర్మన్‌గా ఉండేవారు. ఆయన కేంద్ర మంత్రిగా బిజీగా ఉండటంతో స్థానికంగా ట్రస్టు కార్యక్రమాల పర్యవేక్షణకోసం కుమార్తె అదితిని సభ్యురాలిగా నియమించారు. ఇప్పుడు అనూహ్యంగా గజపతిరాజుల కుటుంబం నుంచే నలుగురిని సభ్యులుగా నియమించారు. అశోక్‌ అన్న కుమార్తెను చైర్‌పర్సన్‌గా నియమిస్తూనే... అశోక్‌, అదితిలను సభ్యులుగా చేర్చారు. ఆనందగజపతి రెండో భార్య కుమార్తె ఊర్మిళ, అశోక్‌ సోదరి సునీతాప్రసాద్‌ను కూడా సభ్యులుగా నియమించారు. తమకు సభ్యత్వం దక్కిందనే ఆనందంతో... అశోక్‌ను పదవీచ్యుతుడిని చేయడం గురించి వారెవరూ మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక గతంలో ఆర్థికనిపుణులు, ఐఏఎస్‌ స్థాయి అధికారులకు ట్రస్టులో సభ్యత్వం ఇచ్చేవారు. ఇప్పుడు... ఢిల్లీకి చెందిన అరుణ్‌ కపూర్‌, విజయ్‌ కే.సోందీలను ట్రస్టులో చేర్చారు. ఢిల్లీ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది అయిన విజయ్‌ సంచయిత కుటుంబానికి సంబంధించిన న్యాయ వివాదాలు చూస్తారని తెలుస్తోంది. అరుణ్‌ ఢిల్లీలో సంచయిత చదువుకున్న స్కూలు కరస్పాండెంట్‌ కావడం గమనార్హం.

Updated Date - 2020-03-08T10:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising