ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏందిరా! నీదేమైనా గొప్ప కులమా?

ABN, First Publish Date - 2020-08-26T09:01:49+05:30

తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన విషయం రాష్ట్రపతి వరకు వెళ్లి రేపిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావాడితోనే గొడవపెట్టుకొంటావా?

అంత ధైర్యం ఎక్కడినుంచొచ్చింది?

ఓ బీసీ వ్యక్తిపై వైసీపీ నేతల దాష్టీకం

కర్రతో కొట్టి...అర్ధనగ్నంగా పొలాల్లోకి

లాక్కెళ్లి మద్యం సేవిస్తూ దౌర్జన్యకాండ


కొల్లిపర, ఆగస్టు 25:  తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకునికి శిరోముండనం చేయించిన విషయం రాష్ట్రపతి వరకు వెళ్లి రేపిన సంచలనం మరువకముం దే గుంటూరు జిల్లాలో ఓ బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిపై అదే తరహాలో వైసీపీ నాయకులు దాష్టీకం ప్రదర్శించారు.


‘ఏందిరా నీదేమైనా గొప్ప కులమా! మా వా డి ఎదురుగా కూర్చుని గొడవ ప డతావా?’ అంటూ కర్రతో కొట్టి లుంగీ కూడా లేకుండా అర్ధనగ్నం గా నేల మీద కూర్చోబెట్టారు. తన కు జరిగిన అవమానంపై బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు బీసీ సంఘాల సాయంతో గుం టూరు జిల్లా ఎస్పీని కలిసి న్యా యం కోరాల్సి వచ్చింది.


ఆ వివరాల్లోకి వెళితే.. బాధితుడు శొంఠి సాంబశివరావుది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామం. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వంగా రమేశ్‌రెడ్డి, కొమ్మారెడ్డి సందీ్‌పరెడ్డి.. ఏదో విషయ మై సాంబశివరావు భార్యను గత ఆదివారం అసభ్యంగా దూషించారు. దీనిపై రమేశ్‌రెడ్డి, సందీ్‌పరెడ్డిని సాంబశివరావు అదేరోజు నిలదీశారు. వారు బలవంతంగా సాంబశివరావును బైకుపై ఎక్కించుకొని పొలాల్లోకి తీసుకెళ్లారు.

పొలాల్లో పడేసి కర్ర తో, చేతులతో సాంబశివరావును విపరీతంగా కొ ట్టారు. అనంతరం అక్కడికి సమీపంలోని గొర్రెపా టి వేణు అనే మరో వైసీపీ నాయకుని స్థలంలోకి లాక్కొని వెళ్లారు. లాక్కెళ్లే క్రమంలో సాంబశివరా వు లుంగీ ఊడిపోయింది. లుంగీ కట్టుకొనే అవకా శం కూడా ఇవ్వకుండా.. అలాగే నేలపై బలవంతం గా కూర్చోబెట్టారు. తన భార్యను అసభ్యంగా తిట్ట డం వల్లనే తాను అడగాల్సి వచ్చిందని సాంబశివరావు అన్నా ఆ ముగ్గురు వైసీపీ నేతలు వినిపించుకోలేదు. మద్యం సేవిస్తూ పంచాయతీ నడిపించారు.

‘‘అంత ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందిరా! నీ పెళ్లాన్ని తిట్టాడంటున్నావ్‌... అన్నంతమాత్రాన చేసేసినట్టేనా? మాటవరసకు అంటే నువ్వు నోరెత్తుతావా?’’ అని హూంకరించారు. ‘నీ దేమైనా గొప్ప కులమా!గౌడ, యాదవ కులాలు అసలు ఉన్నా యా!’ అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఇంతలో అక్కడకు చేరుకొన్న సాంబశివరావు బంధువు లు ఆయనను తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారందరినీ వైసీపీ నేతలు అడ్డుకొన్నారు.

‘‘ఎస్‌ఐకి ఫోన్‌చెయ్యరా ద మ్ముంటే’’ అంటూ ఆగ్రహించారు. ఎలాగొలా అక్కడనుంచి బయటపడి బాధితుడితో వారు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొన్నారు. అయితే, బాధితుడు చేసిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు. ఇంతలో అక్కడకు ఆ ము గ్గురు నేతలు వచ్చారు. పోలీసులు చూస్తుండగానే మరోసారి దౌర్జన్యానికి దిగారు. ఈ దృశ్యాలు సోష ల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో వైసీపీ నేతల తీరుపై మంగళవారం బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. బాధితునికి న్యాయం చేయకుంటే ఊరుకోబోమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు.  


Updated Date - 2020-08-26T09:01:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising