ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్ ధరల పెంపుపై సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన

ABN, First Publish Date - 2020-06-23T15:53:25+05:30

పెట్రోల్ ధరల పెంపుపై సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెట్రోల్ ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పద్మశ్రీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దున్నపోతుకు తాడు కట్టి బండిని లాగించి నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ  పెట్రోల్ ధరలు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడిన చందంగా ఉంటుందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నా భారతదేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 6 సంవత్సరాల్లో అడ్డగోలుగా పెట్రోల్ రేటును పెంచుతున్నారని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని పద్మశ్రీ తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రo 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ రేటును రూ.10 వరకు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంటి మా ఖజానా నిండితే చాలు అన్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరని వ్యాఖ్యానించారు. 


‘‘మన రాష్ట్రంలోనే చమురు నిక్షేపాలు ఉన్న మనకు ఎటువంటి ఉపయోగం లేదు రిలయన్స్ లాంటి సంస్థలకు ఆ సంపదను అప్పగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్నాయి’’ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ కేసులకు భయపడి ఈ సమస్యల మీద ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మోదీ ప్రాపకం  కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. మోదీతో ఎలా జత కట్టాలి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో వైసీపీ, టీడీపీలు దొందు దొందులాగా వ్యవహరిస్తున్నాయన్నారు. పెట్రోల్ ధరలు, కరోనా వైరస్ విజృంభణ చేస్తున్నా, చైనా దురాక్రమణ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ, టీడీపీ ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇకనైన స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెట్రోల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-23T15:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising