ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మార్చని కథ.. ఏపీలో ఇప్పటికీ అదే కొట్లాట

ABN, First Publish Date - 2020-04-08T03:04:02+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని చాలా మార్చింది. చాలా కాదు పూర్తిగా మార్చింది. రోజువారీ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ఎప్పుడూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ ప్రపంచాన్ని చాలా మార్చింది. చాలా కాదు పూర్తిగా మార్చింది. రోజువారీ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ఎప్పుడూ చేసుకునే రాజకీయాలన్నీ ఆగిపోయాయి. ఇది మొత్తం ప్రపంచానికి వర్తిస్తుందోమో కానీ ఆంధ్రప్రదేశ్‌కు కాదు. ఎందుకంటే అక్కడ లాక్ డౌన్ సామాన్య ప్రజల జీవితానికే కానీ.. రాజకీయాల పార్టీలకు కాదు. 


కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఓ రకంగా ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది. ప్రపంచమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క అంశం కరోనా. ఇంత ఉధృతిలోనూ, ఇంత హడావుడిలోనూ మన చుట్టు పక్కల ఏదైనా మారనిది అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏపీలో రాజకీయమే. ఇప్పుడు కూడా అదే రాజకీయం నడుస్తోంది. ఇప్పటికీ అదే కొట్లాట.. ఇప్పటికీ అదే సెల్ఫ్ స్టిక్కరింగ్. 


కరోనా లాక్‌డౌన్ కారణంగా పేదలు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారు. ఇలాంటి వారికి సాయం కోసం కేంద్రప్రభుత్వం లక్షా 70 వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ ప్రకటించింది. ఇలాంటి సాయం విషయంలోనూ రాజకీయ రచ్చ జరుగుతోంది. కేంద్రమిచ్చిన రూ.1000 పంపిణీ నుంచి పప్పు, ఉప్పు పంపకాల వరకూ ప్రతీచోట రాజకీయ గలాటా జరుగుతోంది. కందిపప్పు ప్యాకెట్లను చించి అందులోని కందిపప్పు కొట్టేశారని, నిబంధనలను అతిక్రమించి గుంపులు, గుంపులుగా మాస్కులు లేకుండా తిరుగుతూ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విపక్షం పదే పదే ఆరోపిస్తోంది. 

Updated Date - 2020-04-08T03:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising