ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో తగ్గని కరోనా తీవ్రత.. గడచిన 24 గంటల్లో..

ABN, First Publish Date - 2020-08-13T00:03:10+05:30

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 9,597 కరోనా పాజిటివ్ కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో కొత్తగా 9,597 కరోనా కేసులు, 93 కరోనా మరణాలు

అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 9,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1332 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 1235 కరోనా కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి 929, విశాఖపట్నం 797, అనంతపురం 781, కర్నూలు 781, గుంటూరు 762, నెల్లూరు 723, విజయనగరం 593, శ్రీకాకుళం 511, ప్రకాశం 454, కృష్ణా 335, కడప జిల్లాలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 


ఏపీలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో కరోనా వల్ల 93 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 13 మంది, ప్రకాశం జిల్లాలో 11, చిత్తూరులో 10, నెల్లూరులో 10, శ్రీకాకుళంలో 9, అనంతపురంలో 7, కడపలో 7, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 5, విజయనగరంలో 5, కర్నూలులో 4, పశ్చిమగోదావరిలో 4, కృష్ణలో ఇద్దరు మరణించారు. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2296కి చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54146కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 90425. ఏపీలో కరోనా నుంచి గడచిన 24 గంటల్లో 6,676 మంది కోలుకోగా, ఇప్పటివరకూ 1,61,425 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 



Updated Date - 2020-08-13T00:03:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising