ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. టీడీపీ, వైసీపీ నుంచి..
ABN, First Publish Date - 2020-06-19T04:04:33+05:30
రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో ..
అమరావతి: రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్యేకు మాక్ పోలింగ్ నిర్వహించారు. శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఓటు ఎలా వేయాలో చూపించారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ ఉండగా టీడీపీ నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు.
ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను వైసీపీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్ నత్వానీ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు అటు టీడీపీ కూడా సమాయత్తమైంది. టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య బరిలో ఉండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే చంద్రబాబు విప్ జారీ చేశారు. పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేశారు. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబును నియమించారు. పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటి ఉండనున్నారు. సభ్యులంతా ఓటింగ్‍లో పాల్గొనాలని టీడీడీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ ఏజెంట్‍కు చూపించి ఓటు వేయాలని నిబంధన పెట్టారు.
Updated Date - 2020-06-19T04:04:33+05:30 IST