ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికలకు మేము వ్యతిరేకం

ABN, First Publish Date - 2020-11-25T08:58:46+05:30

ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి

ఏపీ ఎన్జీవో వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన సజ్జల


విజయవాడ సిటీ, నవంబరు 24: ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. విజయవాడలోని ఏపీ ఎన్జీవో హోంలో మంగళవారం ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర సంఘం వెబ్‌సైట్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా  చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలకు తొందర లేదని, కరోనా ఉధృతి తగ్గాకే నిర్వహించాలని సూచించారు. దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. సీపీఎస్‌ రద్దుపై సీఎం సానుకూలంగా స్పందించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు కోరారు. ప్రజా సంక్షేమంతో పాటు ఉద్యోగుల సంక్షేమమూ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల రామకృష్ఱారెడ్డి అన్నారు. అనంతరం సజ్జలను సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, రాష్ట్ర సంఘం నేతలు సిహెచ్‌.పురుషోత్తమనాయుడు, సిహెచ్‌.అజయ్‌కుమార్‌, ఎం.వెంకటేశ్వరరెడ్డి, ఎం.జగదీష్‌, కృపావరం, మహిళా నేతలు బి.జానకి, ఎం.రత్నకుమారి, నిర్మలాకుమారి, కృష్ణాజిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌, 13 జిల్లాలకు చెందిన ఉద్యోగ సంఘం నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T08:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising