తప్పుడు కేసులు ఎత్తివేయాలి
ABN, First Publish Date - 2020-12-15T10:00:21+05:30
హక్కుల, ప్రజా సంఘాల బాధ్యులపై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తివేసి భావప్రకటనా స్వేచ్చను కాపాడాలని ఉపా రద్దు పోరాట
హోం మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు ఉపా రద్దు పోరాట కమిటీ వినతి
గుంటూరు, డిసెంబరు 14: హక్కుల, ప్రజా సంఘాల బాధ్యులపై బనాయించిన తప్పుడు కేసులు ఎత్తివేసి భావప్రకటనా స్వేచ్చను కాపాడాలని ఉపా రద్దు పోరాట కమిటీ కోరింది. హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని సోమవారం ఆయా సంఘాల ప్రతినిధులు కలిసి ఈ మేరకు విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గడచిన నాలుగు దశాబ్దాలుగా పని చేస్తున్న హక్కుల, దళిత, కార్మిక, కళా సంస్థల బాధ్యులు సుమారు 30 మందిపై మావోయిస్టు పార్టీతో సంబంధాలు అంటగడుతూ కేసులు బనాయించారన్నారు.
Updated Date - 2020-12-15T10:00:21+05:30 IST