సెంట్రల్ విస్టా తరహాలోనే అమరావతి
ABN, First Publish Date - 2020-12-11T08:00:58+05:30
‘‘ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా మాదిరిగా అమరావతిలో కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ
వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యతో నాశనం: చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘‘ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సెంట్రల్ విస్టా మాదిరిగా అమరావతిలో కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలని అనుకొన్నాం. కాని నాశనం చేశారు’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన భారత పార్లమెంటు నూతన భవనాలకు శంఖుస్థాపన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక కలికితురాయిగా నిలిచిపోతుంది. భారతీయుల ఆకాంక్షలకు ఈ ఐకానిక్ సెంట్రల్ విస్టా ప్రతిబింబంగా ఉంటుంది. అదే తరహాలో అమరావతిలో కూడా సెంట్రల్ స్పైన్‌గా గవర్నమెంట్ కాంప్లెక్స్, రాజ్ భవన్, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతులు, ఇతర కార్యాలయాలు ఒకే చోట ఉండేలా రూపకల్పన చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతిని రాష్ట్రానికే కాకుండా దేశానికే చెరగని సంపదగా నిర్మాణం చేపడితే ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల అదంతా నాశనం అయింది. భగవంతుడి అభీష్టం అమరావతి. కాలమే దానికి దిక్చూచీ’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - 2020-12-11T08:00:58+05:30 IST