ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు గేట్లు ఎత్తేశారు: యనమల

ABN, First Publish Date - 2020-08-13T07:15:10+05:30

కరోనాకు గేట్లు ఎత్తేశారు: యనమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/నెల్లూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనాకు రాష్ట్ర సర్కారు గేట్లు ఎత్తేసింది. కొవిడ్‌-19 నియంత్రణలో జగన్‌ చేతులెత్తేశారు. నాలుగు నెలల క్రితం కేసుల్లో అట్టడుగున ఉన్న రాష్ట్రం ఇప్పుడు టాప్‌ ర్యాంకులోకి చేరింది. దూరదృష్టి లోపం, సమీక్షల్లో వైఫల్యం, దిశానిర్దేశం కొరవడడం, తేలిగ్గా తీసుకోవడం, నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వ పంచ మహాపాతకాలు. అమెరికా, బ్రెజిల్‌ స్థాయికి మన రాష్ట్రం చేరడం సిగ్గుచేటు’’ అని టీడీపీ  నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘‘ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం మీ పబ్జీ గేమ్‌ కాదని గుర్తుంచుకోండి. రోజుకు 90మంది ప్రాణాలు కోల్పోతుంటే నిద్ర ఎలా పడుతోంది’’ అని సీఎంను ప్రశ్నించారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. యువకుడైన సీఎం రాష్ట్రంలో ఉండి కూడా, నాలుగు ఆసుపత్రులు తిరిగి ప్రజలకు ధైర్యం కల్పించలేకపోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. 

Updated Date - 2020-08-13T07:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising