ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్త ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు!

ABN, First Publish Date - 2020-03-08T10:39:02+05:30

రాష్ట్రంలో ప్రైవేట్‌రంగంలో కొత్త జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో నోటిఫికేషన్‌.. 

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేట్‌రంగంలో కొత్త జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ త్వరలోనే నోటిఫి కేషన్‌ విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య, జూనియర్‌ కాలేజీలు తక్కువగా ఉండటం, వయబిలీటీ తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మండలాల వారీగా అన్‌ సర్వ్‌డ్‌ ఏరియాను గుర్తించి నోటిఫికేషన్‌ విడుదల చేస్తా రు. రాష్ట్రం మొత్తంమీద ఎన్ని కాలేజీలు అవసరమన్నది కాకుండా.. అన్ని ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తకాలేజీల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని బోర్డు భావిస్తోంది. రాష్ట్రం లో కొత్త ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల కోసం ఐదేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చారు. తర్వాత నోటిఫికేషన్‌ లేక ఇంటర్‌బోర్డుపై ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయ పైరవీలతో సీఎం జగన్‌ ప్రభు త్వం దొడ్డి దారిలో పలు కాలేజీలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వయబిలిటీ ఉన్న ప్రాంతాలను గుర్తించి నోటిఫికేషన్‌ ద్వారానే కొత్త కాలేజీలు ఇవ్వడం మంచిదని ఇంటర్‌బోర్డు ఓ నిర్ణయానికి వచ్చింది. 

Updated Date - 2020-03-08T10:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising