ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2020-10-25T16:06:42+05:30

విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారిని జయించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

Minister Vellampalli Srinivas Rao File Photo
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారిని జయించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మనసున్న మారాజు అని, ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అమ్మవారి ఎఫ్‌డి లను ఖర్చు చేశారే తప్ప.. ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదన్నారు. కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ భక్తులు అమ్మవారి దసరా ఉత్సవాలను విజయవంతం చేశారని మంత్రి పేర్కొన్నారు. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలన్నారు. అలాగే వరద ఉధృతిని బట్టి తెప్పోత్సవం నిర్వహించాలని భావిస్తున్నామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. జల విహారం పూర్తిగా ఉండదన్నారు. హంస వాహనంపై పూజా కార్యక్రమాల అనంతరం కొంచెం దూరం మాత్రమే అమ్మవారు వివహరిస్తారని మంత్రి వివరించారు.

Updated Date - 2020-10-25T16:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising