ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ లాక్‌డౌన్.. మరిన్ని కఠిన నిర్ణయాలు..

ABN, First Publish Date - 2020-03-24T13:35:15+05:30

కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 1897 యాక్ట్‌ ప్రకారం లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన జీవోకు అదనంగా మరిన్ని నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రంలో పబ్లిక్ ప్రదేశాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 1897 యాక్ట్‌ ప్రకారం లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వం.. గతంలో ఇచ్చిన జీవోకు అదనంగా మరిన్ని నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రంలో పబ్లిక్ ప్రదేశాల్లో నలుగురికి మించి ఉండకూడదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం రోడ్ల మీదకు రావాలని, ఆ తరువాత బయటికి వస్తే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ద్విచక్రవాహనంపై ఇద్దరు, కార్లలో ఇద్దరికి మించి ప్రయాణం చేయకూడదని, అది కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని ఆదేశించారు. రాత్రి 8 తర్వాత మందుల షాపులు తప్ప మరే ఇతర షాపులు తెరిచి ఉంచడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నిత్యావసరాల కోసం వచ్చేవారు వారి ఇంటి దగ్గర నుంచి కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉందన్నారు.

Updated Date - 2020-03-24T13:35:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising