ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

ABN, First Publish Date - 2020-02-28T16:31:59+05:30

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో పరీక్షల హాల్‌ టికెట్లు పొందే విధానానికి చెక్‌ పడింది. కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను నేరుగా విద్యార్థులే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం

75 శాతం హాజరున్న అభ్యర్థులకే ఈ వెసులుబాటు

ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఇంటర్మీడియట్‌ బోర్డు

60 శాతం హాజరున్నవారు

అపరాధ రుసుం చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చు

ప్రైవేటు కళాశాలల మొండి వైఖరికి చెక్‌


ఇంటర్మీడియట్‌ విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో పరీక్షల హాల్‌ టికెట్లు పొందే విధానానికి చెక్‌ పడింది. కాలేజీ ప్రిన్సిపాల్‌ సంతకంతో హాల్‌ టికెట్‌ ఉండాలన్నా నిబంధనకు తెరపడింది. ఈ ఏడాది నుంచి వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల మొండి వైఖరికి చెక్‌ పడినట్టయింది. ఫీజులతో హాల్‌ టికెట్లను ముడిపెట్టి బెదిరించే కళాశాలల ఆటలిక సాగవు. మార్చి నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ థియరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 1,20,298 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 75 శాతం హాజరు కలిగిన విద్యార్థుల హాల్‌ టికెట్లను బోర్డు ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. గత ఏడాది వరకు హాల్‌ టికెట్లను విద్యార్థులు చదివిన కళాశాలలకు పంపేవారు. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు హాల్‌ టికెట్లపై సంతకం చేసి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి ఆ విధానానికి స్వస్తి పలికి వెబ్‌సైట్‌ నుంచి నేరుగా విద్యార్థులే హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.


అపరాధ రుసుం చెల్లించి..

75 శాతం హాజరు కలిగిన విద్యార్థుల హాల్‌ టికెట్లను మాత్రమే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. అంత హాజరు శాతం లేని విద్యార్థుల హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ కావు. 70 శాతం నుంచి 75 శాతం లోపు హాజరున్న విద్యార్థులు రూ.వెయ్యి, 65 నుంచి 70 శాతం హాజరుంటే రూ.1,500, 60 నుంచి 65 శాతం లోపు హాజరున్న విద్యార్థులు రెండు వేల రూపాయల అపరాధ రుసుంను బ్యాంక్‌లో చెల్లించి ఆ రశీదును ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సమర్పిస్తే వారి హాల్‌ టికెట్‌ ఇస్తారు. 60 శాతం కంటే తక్కువ హాజరున్న విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వరు. అయితే ఆర్ట్స్‌ గ్రూప్‌ చదువుతున్న విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నప్పటికీ రూ.వెయ్యి అపరాధ రుసుం చెల్లిస్తే హాల్‌ టికెట్‌ ఇస్తారు. అయితే వారు రెగ్యులర్‌ విద్యార్థిగా అవకాశం కోల్పోతారు. ప్రైవేటు విద్యార్థులుగా పరిగణిస్తూ వారికి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. వీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మార్కుల లిస్టులో కూడా ప్రైవేటు విద్యార్థి గానే ఉంటుంది.


గగ్గోలు పెడుతున్న ప్రైవేటు కళాశాలలు 

ఇంటర్మీడియట్‌ బోర్డు ఈ ఏడాది నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి పొందే వెసులుబాటు కల్పించడంతో కార్పొరేట్‌, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు గగ్గోలు పెడుతున్నాయి. గత ఏడాది వరకు కాలేజీల్లోనే హాల్‌ టికెట్లను పంపిణీ చేయ డంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హాల్‌ టికెట్లను ఫీజులతో ముడిపెడుతూ... ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే వాటిని ఇస్తామని బెదిరింపులకు పాల్పడేవి. సెకండియర్‌ విద్యార్థులు పూర్తిగా ఫీజులు చెల్లించారో లేదో చెక్‌ చేసి, రూపాయి బ్యాలెన్స్‌ ఉన్నా సరే చెల్లిస్తేనే హాల్‌ టికెట్‌ ఇస్తామని ఖరాఖండిగా చెప్పేవారు. దీంతో విద్యార్థులు పూర్తి ఫీజులు చెల్లించి హాల్‌ టికెట్లు పొందేవారు. ఈ ఏడాది నుంచి ఇలాంటి సమస్యలు విద్యార్థులకు ఉండవు. కళాశాలలకు ఫీజు ఎంత బ్యాలెన్స్‌ ఉన్నాసరే పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్‌ నేరుగా హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చు.


ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను ఇంటర్మీడియట్‌ అఫీషియల్‌ వెబ్‌సైట్‌ bie.ap.gov. in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్‌లో గూగూల్‌ సెర్చ్‌లో bie.ap.gov.in చూడాలి. అప్పుడు ఇంటర్మీడియట్‌ బోర్డు అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ఎడమ వైపు ఐపీఈ మార్చి-2020 ఎగ్జామినేషన్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే డౌన్‌లోడ్‌ థియరీ ఎగ్జామినేషన్‌ హాల్‌ టికెట్‌ అని వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే హాల్‌ టికెట్‌ పొందడానికి ఒక ఫార్మట్‌ వస్తుంది. ఇందులో కుడివైపు హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులైతే తమ టెన్త్‌ క్లాస్‌ హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా, ఆధార్‌ కార్డు నంబర్‌, ద్వితీయ సంవత్సరం అభ్యర్థులు తమ ప్రథమ సంవత్సర హాల్‌ టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. లేదా ఆధార్‌ కార్డు నంబర్‌నైనా ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత ఎడమ వైపు తమ పుట్టిన తేదీని ఎంటర్‌ చేశాక క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. అనంతరం దిగువ కనిపించే డౌన్‌లోడ్‌ హాల్‌ టికెట్‌పై క్లిక్‌ చేయగానే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ అయిపోతుంది.

Updated Date - 2020-02-28T16:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising