ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

ABN, First Publish Date - 2020-07-06T17:31:31+05:30

అమరావతి: ఏపీలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఈనెల 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు అధికారులు  ప్రకటించారు. ఆగస్ట్ 15న ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఈ ప్రాజెక్టును సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  తెల్లరేషన్ కార్డు ఉండి ఇల్లు లేని కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రధాన అంశంగా కూడా ఉంది. ఇప్పటికే పలు సంక్షేమపథకాలను ఆయన అమలు చేశారు. ఇక ఈ ఇళ్ల స్థలాల పంపిణీని అమలు చేయాల్సి ఉంది.తన తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దాదాపు 28 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భావించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలను కూడా సేకరించారు. అయితే కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. 




Updated Date - 2020-07-06T17:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising