ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ABN, First Publish Date - 2020-03-27T18:11:20+05:30

తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చేవారిపై రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్‌వోసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని.. ఆరోగ్యపరంగా బాగుంటేనే అనుమతించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే క్వారంటైన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.


క్వారంటైన్‌ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచి ఎప్పటికప్పుడు డాక్టర్లను పర్యవేక్షించేలా చూడాలని సర్కార్‌కు హైకోర్టు తెలిపింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుడటం, మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోతుండటంతో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టు పిటిషన్‌ వేశారు. దీనిపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించి పైన చెప్పిన విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. 















Updated Date - 2020-03-27T18:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising