ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ, వార్డు సచివాలయాల్లో బిల్డింగ్ అనుమతులపై హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2020-08-04T22:31:39+05:30

గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు అనాథరైజ్డ్ గా బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను లైసెన్డ్ టెక్నికల్ పర్సన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీలు అనాథరైజ్డ్ గా బిల్డింగ్ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను లైసెన్డ్ టెక్నికల్ పర్సన్ దాఖలు చేసింది. 119 జీఓ కి విరుద్ధంగా తమ సంతకాలు, లైసెన్స్ నంబర్లు లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నట్లు పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అనుభవం లేని గ్రామ, వార్డు రెగ్యులేషన్ సెక్రటరీలు ఇచ్చే అనుమతుల కారణంగా భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న పిటిషనర్స్ పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో 119ప్రకారం నడుచుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. హైకోర్టు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ అనుమతులు నిలిచిపోనున్నాయి. కాగా, పిటిషనర్స్ తరుపున న్యాయవాది తిరుమాని విష్ణుతేజ వాదనలు వినిపించారు. కాగా, దీనిపై వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం నాలుగు వారాల సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-08-04T22:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising