ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం పరువు రోడ్డు మీదకు వచ్చింది: సుజనా చౌదరి

ABN, First Publish Date - 2020-05-29T23:10:21+05:30

ఏపీ ప్రభుత్వం పరువు రోడ్డు మీదకు వచ్చింది: సుజనా చౌదరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వం పరువు రోడ్డు మీదకు వచ్చిందని రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అనేక తీర్పులను పట్టించుకోకుండా.. ఏపీలో కనీసం పాలన లేదు అనేది హైకోర్టు తీర్పులే నిదర్శనంగా కనిపిస్తున్నాయని సుజనా అన్నారు. ఇవేమీ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అయినా.. కొన్ని పరిమితులు ఉంటాయనేది తెలుసుకోవాలని సుజనా చౌదరి సూచించారు. తనకు 151సీట్లు వచ్చాయని, తాను ఇష్టానుసారంగా చేస్తాను అంటే మన భారత రాజ్యాంగం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు చేసేందుకు చాలా సమయం ఉందని, కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అభివృద్దిపై దృష్టి పెట్టాలని, వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఎరుపు సుధాకర్ రెడ్డి విషయంలో గవర్నర్ ను  తప్పుదోవ పట్టించారని, సుప్రీంకోర్టు అన్ని అంశాలను విచారించి గవర్నర్ నిర్ణయం సరికాదని, రద్దు చేసిందని గుర్తు చేశారు. ఏపీ రాజ్ భవన్ వారు కూడా న్యాయపరమైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదనేది తన అభిప్రాయం చెప్పారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, రాజకీయాలకు అతీతంగా భారత రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా పాలించాలని సుజనా స్పష్టం చేశారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు చేయడం మాని.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో అభివృద్ది, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని, అధికారులు కూడా ఆలోచించి సంతకాలు చేస్తే మంచిదని సుజనా చౌదరి సూచించారు.

Updated Date - 2020-05-29T23:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising