ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు!

ABN, First Publish Date - 2020-11-14T01:52:08+05:30

ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్ని వ్యక్తిపూజలకు నిలయాలుగా మార్చేలా ప్రభుత్వ ఆదేశాలున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సర్కార్ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్ని వ్యక్తిపూజలకు నిలయాలుగా మార్చేలా ప్రభుత్వ ఆదేశాలున్నాయి. 18వ తేదీన శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏపీలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల స్వరూపానంద, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికాడంపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నుంచి ప్రభుత్వం బయటపడకముందు ఇప్పుడు కూడా స్వరూపానంద విషయంలో మరో వివాదాస్పద ఆదేశాలు చేసి ప్రభుత్వం అభాసుపాలయింది.


గతంలో కూడా శ్రీవారి దర్శనానికి వచ్చిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు... ఏకంగా అలిపిరికి వెళ్లి మరీ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే... ఎంత పెద్ద పీఠాధిపతి అయినా, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతిలాంటి ప్రముఖలకైనా తిరుమలలోనే అధికారులు స్వాగతం పలుకుతారు. అదే ఆచారం, సంప్రదాయం! కానీ... స్వరూపానందకు టీటీడీ ఉన్నతాధికారులతోపాటు పలువురు జిల్లా అధికారులు అలిపిరి వద్దే స్వాగతం పలికారు. మఠాధిపతులు, పీఠాధిపతులను గౌరవించడం మన సంప్రదాయం. అంతేకానీ... సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆపచారం. అధికారులు భక్తులకు సేవకుల్లా ఉండేలా తప్పా రాజకీయ పార్టీ నాయకుల్లా వ్యహరించడం బాధ్యతా రాహిత్యమనే విమర్శలు వెల్లువెత్తాయి.









Updated Date - 2020-11-14T01:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising