టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకం
ABN, First Publish Date - 2020-10-08T04:34:40+05:30
టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
అమరావతి: టీటీడీ నూతన ఈవోగా జవహర్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం జవహర్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఇటీవలే బదిలీ అయ్యారు. దీంతో ఈ స్థానంలో జవహర్‌రెడ్డికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Updated Date - 2020-10-08T04:34:40+05:30 IST