ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ జాలర్లకు ఆహారం అందించాం

ABN, First Publish Date - 2020-04-05T09:11:59+05:30

లాక్‌డౌన్‌ వల్ల మహారాష్ట్రలో చిక్కుకుపోయిన 60 మంది ఏపీ జాలర్లను గుర్తించామని, వారికి ఆహారం సరఫరా చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు. వారిని ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చంద్రబాబు లేఖపై స్పందించిన మహారాష్ట్ర సీఎం

ముంబై, ఏప్రిల్‌ 4: లాక్‌డౌన్‌ వల్ల మహారాష్ట్రలో చిక్కుకుపోయిన 60 మంది ఏపీ జాలర్లను గుర్తించామని, వారికి ఆహారం సరఫరా చేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు. వారిని ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు గంటల వ్యవధిలోనే ఆయన స్పందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆ జాలర్లను ఆదుకోవాలంటూ మహారాష్ట్ర సీఎంకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వేర్వేరుగా చంద్రబాబు శుక్రవారం లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఆ జాలర్లు ముంబై తీరంలోని మాధ్‌ దీవిలో ఎక్కడ చిక్కుకుపోయారో జిల్లా కలెక్టర్‌ గుర్తించారని, ఆహారం సరఫరా చేశారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం శనివారం ట్వీట్‌ చేసింది. ‘షెల్టర్‌ విషయంలో వారికి ఏ విధమైన ఇబ్బందీ లేదు. అయితే, ఆహారమే కొరత. వారికి ఆహారం సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. వారు ఆ దీవిలో ఉన్నంతకాలం ఆహారాన్ని అందజేస్తుంటామని మీకు హామీ ఇస్తున్నాం’ అని మహారాష్ట్ర సీఎంవో పేర్కొంది.

Updated Date - 2020-04-05T09:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising