ఏపీ ఎంసెట్ దరఖాస్తుకు రేపటి వరకు గడువు
ABN, First Publish Date - 2020-09-14T12:02:51+05:30
ఈ నెల 17న నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు గడువు పొడిగించింది. అయితే, అభ్యర్థులు రిజిస్ట్రేషన్
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఈ నెల 17న నిర్వహించే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు గడువు పొడిగించింది. అయితే, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు రూ.10 వేల ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబరు 1న జరిగే లాసెట్‌కు 2,000 రుసుముతో ఈనెల 25 వరకు, పీజీఈసెట్‌కు 2,000 రుసుముతో 23వ తేదీ వరకు, 500 రుసుముతో ఎడ్‌సెట్‌కు 25 వరకు, 500 రుసుముతో పీఈసెట్ సెప్టెంబరు 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2020-09-14T12:02:51+05:30 IST