తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదు: ఏపీ డీజీపీ
ABN, First Publish Date - 2020-11-09T00:01:11+05:30
తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదు: ఏపీ డీజీపీ
అమరావతి: నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకేసులో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్ అరెస్ట్ చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐజీ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ ఆఫీజ్ విచారణ ప్రారంభించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని డీజీపీ పేర్కొన్నారు.
Updated Date - 2020-11-09T00:01:11+05:30 IST