ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియా, చంద్రబాబుపై డిప్యూటీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-05-30T23:12:24+05:30

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసి ఇవాళ్టితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సోనియా, బాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిన సోనియా, చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా మారిందో అందరూ చూస్తున్నారని వ్యాఖ్యానించారు.


జగన్ చెప్పిన విధంగానే ప్రపంచం మొత్తం...!

జగన్ అన్నపై ఎవరైతే కేసులు పెట్టి ఆయన్ని బాధించారో వారందరి రాజకీయ జీవితం ఏ విధంగా జీరో అయిందో తెలుస్తోంది. జైల్లో ఉన్న జగన్ అన్న కోసం సీఎం కావాలని ఎంతో మంది ఎన్నో రకాలైన పూజలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలను విడదీసి పాలించే చర్యలు చేపట్టారు. ఈ రోజు మాల మాదిగలను అట్రాక్ట్ చేసే విధంగా జగన్ చర్యలు చేపట్టారు. అందుకే ఆ కులాల వారు ఆయనకు దగ్గరయ్యారు. కరోనా వైరస్ అంశంలో జగన్ చెప్పిన విధంగా ప్రపంచం మొత్తం ఈ రోజు కరోనా వైరస్‌తో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేశంలోని అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీని అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నాయి. మామ ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించారు. పేదల రక్తాన్ని మద్యం రూపంలో పీల్చి పిప్పిచేసిన ఘనత చంద్రబాబుదిఅని నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


లాక్ డౌన్ పూర్తిగా ఉల్లంఘటన

ఇదిలా ఉంటే.. ఇవాళ గంగాధర నెల్లూరు మండలం వేలుకూరులో ‘రైతు భరోసా’ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమం జనంతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమానికి అధికారులు, రైతులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే.. ఎక్కడా సోషల్ డిస్టన్స్ గానీ మాస్క్‌లు గానీ లేకుండా కార్యక్రమానికి హాజరై పూర్తిగా లాక్ డౌన్‌ను ఉల్లంఘించారు.

Updated Date - 2020-05-30T23:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising