ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సున్నా వడ్డీకే రుణాలిస్తాం: సీఎం జగన్

ABN, First Publish Date - 2020-02-08T19:21:01+05:30

పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిస్తామని.. త్వరలోనే ఈ పథకానికి శ్రీకారం చుడతామని సీఎం తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకం ఉండేదని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నిలిపి వేసిందన్నారు. రాజమండ్రిలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడిన ఆయన సున్నా వడ్డీకే రుణాలు ప్రకటన చేశారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ల కోసం చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఏపీ నుంచే ఉద్భవించాలని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు 18 దిశ పీఎస్‌లు అందుబాటులోకి వస్తాయని.. దిశ పీఎస్‌లలో అత్యధికంగా మహిళలే ఉంటారని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో మూడు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తామని.. దిశ చట్టం విషయంలో...  రాష్ట్ర పరిధిలోని అన్ని అంశాలను నాలుగు నెలల్లో పూర్తిచేస్తామన్నారు. 

Updated Date - 2020-02-08T19:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising