ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షా దృష్టికి జగన్‌ తీసుకెళ్లిన అంశాలు ఇవే

ABN, First Publish Date - 2020-09-24T03:47:45+05:30

అమిత్‌షా దృష్టికి జగన్‌ తీసుకెళ్లిన అంశాలు ఇవే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్‌ కలిసిన విషయం తెలిసిందే. ఏపీకి సంబంధించి రావాల్సిన నిధులపై అమిత్ షాకు జగన్ వినతి పత్రం అందించారు. విభజన తర్వాత రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కరోనా, లాక్‌డౌన్ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని అమిత్ షాకు జగన్ వివరించారు. స్థానిక సంస్థల గ్రాంట్ 2253.52 కోట్లు విడుదల చేయాలని,  రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం 3622.07కోట్లు చెల్లించాలని అమిత్ షాను జగన్ కోరారు.


అమిత్ షాతో భేటీ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ ‘‘ పోలవరం ప్రాజెక్టు బకాయిలు రూ.4,006.43 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.  కేంద్రం నుంచి రీయంబర్స్ క్లిష్టతరంగా మారింది. ఈ ఏడాది సైతం రూ.15వేల కోట్లు పోలవరానికి అవసరం. నేరుగా డబ్బులు చెల్లించేలా డైరెక్ట్‌ లైన్ ఆఫ్ క్రెడిట్ ఓపెన్ చేయాలని కోరాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.24,350 కోట్లతో డీపీఆర్‌ అందించాం. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.700 కోట్లు త్వరగా చెల్లించాలని కోరాం. కాగ్ ఆమోదించిన విధంగా రాష్ట్రానికి చెల్లించాల్సిన ఉన్న 18,830.87 కోట్ల రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరాం. రాజధానిలో భవనాల నిర్మాణానికి ఇవ్వాల్సిన రూ.1000కోట్లను విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న ఉపాధి నిధులు రూ.3740కోట్లను విడుదల చేయాలి.’‘ అని అన్నారు. 

Updated Date - 2020-09-24T03:47:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising