ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లేఖ

ABN, First Publish Date - 2020-06-18T22:33:32+05:30

గవర్నర్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు  ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 10% ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడంపై మీరు జోక్యం చేసుకోవాలని కన్నా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల కేంద్ర ప్రభుత్వం అందించిన 10% రిజర్వేషన్లను కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారంతా నష్టపోతున్నారని కన్నా అన్నారు. దేశంలోని ఉన్నత కులాల ప్రజలు ఆర్థికంగా బలహీనమైన వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇదన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయడం లేదని, విద్యార్థులు ఉన్నత, వృత్తి విద్యా సంస్థలలో ప్రవేశంతో పాటు ఉపాధికి అనేక అవకాశాలను కోల్పోతున్నారని కన్నా పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ విభాగాలకు చెందిన ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసినా .. తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని కన్నా తెలిపారు. లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10% రిజర్వేషన్లను  వెంటనే అమలు చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని  గవర్నర్ ను కోరినట్లు కన్నా లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-18T22:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising