మద్యం విక్రయాలపై మరో పిటిషన్ దాఖలు
ABN, First Publish Date - 2020-05-09T09:41:05+05:30
కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ..
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విశాఖపట్నానికి చెందిన ఒ.నరేశ్‌కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Updated Date - 2020-05-09T09:41:05+05:30 IST