ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌కు మరో 91మంది బలి ..

ABN, First Publish Date - 2020-08-22T08:57:56+05:30

రాష్ట్రంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. గురువారం 55,010మందికి పరీక్షలు నిర్వహించగా 9,544మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త కేసులు 9,544 

మొత్తం 3,34,940

3,092కు చేరిన మరణాలు 

నెల్లూరు కార్పొరేషన్‌లో 

31మంది ఉద్యోగులకు వైరస్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. గురువారం 55,010మందికి పరీక్షలు నిర్వహించగా 9,544మందికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 3,34,940కి చేరాయి. తాజాగా 8,827 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 2,44,045మంది డిశ్చార్జి కాగా, 87,803మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 91మంది కొవిడ్‌కు బలయ్యారు.


చిత్తూరులో 16మంది, పశ్చిమగోదావరిలో 13మంది, నెల్లూరులో 12మంది, తూర్పుగోదావరిలో 11మంది, అనంతపురంలో 8మంది, కడపలో ఏడుగురు, విశాఖలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 3,092కు పెరిగాయి. తూర్పుగోదావరిలో మరో 1,312మందికి వైరస్‌ సోకింది. జిల్లాలో మొత్తం కేసులు 46,668కి చేరాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 919మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.విశాఖ జిల్లాలో మరో 738మంది వైరస్‌ బారినపడ్డారు. జిల్లాలో ఇప్పటివరకూ 29,225మందికి కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా 761 పాజిటివ్‌లు నమోదయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 31మంది ఉద్యోగులకు కరోనా సోకింది. చిత్తూరులో 735, అనంతపురంలో 704, శ్రీకాకుళంలో 571, గుంటూరులో 358, కడపలో 343, కృష్ణాజిల్లాలో 265 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి.

Updated Date - 2020-08-22T08:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising