ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో మరో 6,923 కేసులు

ABN, First Publish Date - 2020-09-28T10:33:29+05:30

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 76,416 శాంపిల్స్‌ను పరీక్షించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 76,416 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,923 మందికి కరోనా సోకినట్టు ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,006 కేసులు నమోదు కాగా.. పశ్చిమ గోదావరిలో 929 మందికి వైరస్‌ సోకింది. తాజాగా మరో 7,796 మం ది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం రికవరీలు 6,05,090కి చేరుకున్నట్టయింది. ప్రస్తుతం 64,876 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మరో 45 ప్రాణాలను బలితీసుకుంది. ప్రకాశం జిల్లాల్లో 8 మంది, కృష్ణాలో 6, గుంటూరులో 5, తూర్పుగోదావరిలో 4, పశ్చిమగోదావరిలో 4, అనంతపురంలో 3, కడపలో 3, కర్నూలులో 3, నెల్లూరులో 3, విశాఖపట్నంలో 3, చిత్తూరులో 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాలు 5,708కి చేరుకున్నాయి.


లక్ష కేసుల దిశగా తూర్పు

తూర్పుగోదావరి జిల్లాలో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా నమోదైన 1,006 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 94,190కి చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదారు రోజుల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకునే అవకాశం ఉంది. కరోనా దెబ్బకు జిల్లాలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 511కి పెరిగింది. పశ్చిమ గోదావరిలోనూ కరోనా కేసులు 65 వేలకు చేరువయ్యాయి. తాజాగా నమోదైన నాలుగు మరణాలతో కలిపి జిల్లాలో మృతుల సంఖ్య 444కి చేరుకుంది. నెల్లూరు జిల్లాలో 506 కేసులతో బాధితుల సంఖ్య 52,565కి పెరిగింది. కృష్ణా జిల్లాలో 333 మంది వైరస్‌ బారినపడగా.. కరోనాతో మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 26,487కి, మరణాలు 430కి పెరిగాయి. కర్నూలు జిల్లాలో 229 మందికి పాజిటివ్‌ రాగా.. బాధితుల సంఖ్య 55,685కి పెరిగింది.


తాజాగా ముగ్గురు మృతిచెందగా.. మరణాల సంఖ్య 462కు చేరింది. విజయనగరం జిల్లా కొత్తగా 376 మందికి వైరస్‌ సోకగా.. శ్రీకాకుళం జిల్లాలో మరో 503 కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో మరో 472 కేసులు బయటపడగా.. కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,046కి, మరణాల సంఖ్య 439కి పెరిగాయి. అనంతపురం జిల్లాలో మరో 480 కేసులు నమోదవగా.. బాధితుల సంఖ్య 56209కి పెరిగింది. తాజాగా కరోనాతో మరో ముగ్గురి మృతితో మొత్తం మరణాలు 477కి చేరుకున్నాయి. గుంటూరు జిల్లాలో 535 మందికి వైరస్‌ సోకగా.. బాధితుల సంఖ్య 54,863కి పెరిగింది.  కరోనాతో ఇప్పటివరకు 582 మంది చనిపోయారు. విశాఖ జిల్లాలో మరో 318 మందికి వైరస్‌ సోకింది. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసులు 49,869కి చేరాయి. జిల్లాలో మరో ముగ్గురు మృతితో కొవిడ్‌ మరణాల సంఖ్య 391కి చేరింది.

Updated Date - 2020-09-28T10:33:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising