ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోంది: అంగర రామ్మోహన్‌

ABN, First Publish Date - 2020-12-15T23:30:46+05:30

రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం దివాళా తీయిస్తోందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ విమర్శించారు. వ్యక్తులు, కంపెనీలు ఐపీ పెట్టడం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో: రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం దివాళా తీయిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ విమర్శించారు. వ్యక్తులు, కంపెనీలు ఐపీ పెట్టడం చూశాం.. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఐపీ పెట్టబోతుందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీ అభివృద్ధికి లక్షా పాతిక వేల కోట్లు అప్పుచేశారని.. జగన్ ఒక్క ఏడాదిలోనే లక్ష కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పాతాళంలోకి పడిపోయిందని విమర్శించారు. మద్యపాన నిషేధం అంటూనే మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంతో వడ్డీలు కడతామంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వల్లే ఏలూరు ఘటన జరిగిందని ఈఘటనకు ముమ్మాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బంది పడతున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-15T23:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising