ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు..!

ABN, First Publish Date - 2020-06-23T22:18:28+05:30

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య పెరగనుందా..? 13 జిల్లాలు కాస్తా 25 జిల్లాలుగా మారనున్నాయా..? ముఖ్యమంత్రి జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. త్వరలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల సంఖ్య పెరగనుందా..? 13 జిల్లాలు కాస్తా 25 జిల్లాలుగా మారనున్నాయా..? ముఖ్యమంత్రి జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే అవుననే అనిపిస్తోంది. త్వరలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం అని తెలుస్తోంది. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ నోట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది. ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని అధికారులకు సీఎం వివరించారు. కాగా, సీఎం సూచనల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. సీఎం నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా 12 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.


ఇదిలా ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణలో కొలువుదీరిన టీఆర్ఎస్ సర్కార్ పది జిల్లాలను కాస్తా 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం నాటి టీడీపీ ప్రభుత్వం 13 జిల్లాలనే కొనసాగిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల అనంతరం ఏర్పడిన సీఎం జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. సీఎం జగన్ గతంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాధాన్యతపై అధికారులతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు తథ్యం అని అంతా అనుకున్నారు. వివిధ కారణాల చేత ఆ నిర్ణయం ఆలస్యమైంది. తాజాగా మరోసారి జిల్లాల పెంపు అంశం తెరపైకి వచ్చింది.

Updated Date - 2020-06-23T22:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising