ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 97 మంది మృతి
ABN, First Publish Date - 2020-08-23T00:24:16+05:30
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఇవాళ ఒక్కరోజే 10,276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3లక్షల 45,216కి చేరింది. గత 24 గంటలుగా 97 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మొత్తం 3,189 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 89,389 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకూ 2,52,638 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో 31,91,326 కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏ జిల్లాలో ఎన్నెన్ని మరణాలు..
చిత్తూరు జిల్లాలో 13, అనంతపురంలో 11, నెల్లూరులో 10, తూర్పుగోదావరి, కడప, కర్నూలు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పన మృతి చెందారు. శ్రీకాకుళం 05, కృష్ణా 03, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఏ జిల్లాలో ఎన్నెన్ని కేసులు..
Updated Date - 2020-08-23T00:24:16+05:30 IST