ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70శాతం కేసులు మర్కజ్ నుంచి వచ్చిన వారివే: సీఎం జగన్

ABN, First Publish Date - 2020-04-01T22:46:25+05:30

రెండురోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రెండు రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని.. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఢిల్లీ మీటింగ్‌కు ఏపీ నుంచి 1,085మంది వెళ్లి వచ్చారన్నారు. మొత్తం 585మందికి పరీక్షలు చేశాం, 70 కేసుల్లో పాజిటివ్‌ వచ్చిందన్నారు. మరో 500 కేసుల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో 21మంది కోసం గాలింపు చేపట్టామన్నారు. 104కు ఫోన్‌ చేసి స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకోవాలన్నారు. 


ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ సదస్సులో పాల్గొన్నవారికి కరోనా వైరస్‌ సోకిందని.. ఢిల్లీ సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్‌, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. కరోనా పట్ల అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దన్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని.. విదేశాల్లో దేశాధినేతలకు కూడా కరోనా సోకింది, నయమైందన్నారు. 


Updated Date - 2020-04-01T22:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising