ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు కళ్లుంటే ఆంధ్ర సర్వనాశనం: ఫరూక్‌

ABN, First Publish Date - 2020-02-09T10:17:25+05:30

‘‘జగన్‌ రెండు కళ్లతోనే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పినట్లు మూడుకళ్లుంటే ఆంధ్ర సర్వనాశనం కావడం ఖాయం’’ అని ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ కర్నూలు జిల్లా నంద్యాలలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘జగన్‌ రెండు కళ్లతోనే రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పినట్లు మూడుకళ్లుంటే ఆంధ్ర సర్వనాశనం కావడం ఖాయం’’ అని ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ కర్నూలు జిల్లా నంద్యాలలో అన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత, స్థాయి జగన్‌కు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదన్నారు. ‘‘ఎన్టీఆర్‌ బొమ్మ లేకుంటే టీడీపీకి డిపాజిట్లు రావని మంత్రి అనిల్‌ అంటున్నారు. మీకు దమ్ముంటే వైఎ్‌సఆర్‌ బొమ్మ లేకుండా కొత్తపార్టీ పెట్టి గెలిచే సత్తా ఉందా? కాంగ్రెస్‌ నేత బొమ్మను వైసీపీ జెండాపై ఎందుకు ముద్రించుకుని పబ్బం గడుపుకుంటున్నారు? వైఎ్‌సఫొటో లేకపోతే మీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు’’ అని ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ని అమలు చేయడం లేదని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడం లేదని ఫరూక్‌ ప్రశ్నించారు.


పరిశ్రమల తరలింపులో జగన్‌ హ్యాట్రిక్‌: పట్టాభిరామ్‌

‘‘రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమలను వెళ్లగొట్టడంలో సీఎం జగన్‌ హ్యాట్రిక్‌ సాధించారు. నాడు చంద్రబాబు అష్టకష్టాలుపడి తీసుకొచ్చిన పరిశ్రమలను జగన్‌ తన స్వార్థంకోసం తన్ని తరిమేస్తున్నాడు. మొన్న కియా, నిన్న ఫ్రాంక్లీన్‌ టెంపుల్టన్‌, నేడు రిలయన్స్‌ జియో పరిశ్రమలను రాష్ట్రం నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.


రాయలసీమ ప్రాంత యువతకు ఉపాధి కల్పనా కేంద్రాలుగా ఉన్న ఈ భారీ పరిశ్రమలు తనకు జే టాక్సు చెల్లించడంలేదనే అక్కసుతో వాటిని వెళ్లగొట్టి యువతకు అన్యాయం చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో రిలయన్స్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకొని పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పేదల నివేశన స్థలాలకు ఉపయోగించాల్సిన వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని మిషన్‌ బిల్ట్‌ పేరుతో అమ్మి సొమ్ము చేసుకొంటూ పారిశ్రామిక భూములను పేదల ఇళ్ల పేరుతో స్వాధీనం చేసుకోవడం సరికాదని పట్టాభిరామ్‌ అన్నారు. 

Updated Date - 2020-02-09T10:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising