ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలా జరగకపోతే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి: విష్ణువర్ధన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-07-12T20:21:12+05:30

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇలాగే మార్చితే ప్రజా ఆందోళన ఎదుర్కోక తప్పదని ఆయన అన్నారు. ఆంధ్రా సీఎం సిట్టక్కర్ సీఎంగా మారిపోతున్నారని విమర్శించారు. నవరత్నాలంటే కేంద్ర ఫథకాలుగా ఆంధ్రా ప్రజలనుకుంటున్నారని అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో పేరు మార్చి తమ సొంత పథకాలుగా చేసే ప్రచారాన్ని ఆపాలన్నారు. ఇకపై ఏ కేంద్ర ప్రభుత్వ పథక ప్రకటనైనా రాష్ట్రంలో జారీ చేస్తే అందులో ప్రధాన మంత్రి ఫోటో, కేంద్ర ప్రభుత్వ లోగో తప్పనిసరిగా ముద్రించాలన్నారు. అలా జరగని పక్షంలో ఆ పథకానికయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. పథకాల ప్రారంభ సమయంలో కేంద్ర సహాయం ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-07-12T20:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising