ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలను విస్మరిస్తున్న వైసీపీ

ABN, First Publish Date - 2020-12-29T06:16:04+05:30

రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని వైసీపీ పా లకులు విస్మరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఆదరణ పనిముట్లు మూలన పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు.

కలెక్టరేట్‌ ఎదుట పనిముట్లతో నిరసన తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదరణ పనిముట్లు పంపిణీ చేయాలి

కలెక్టరేట్‌ ఎదుట తమ్ముళ్ల వినూత్న నిరసన


అనంతపురం వైద్యం, డిసెంబరు28: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని వైసీపీ పా లకులు విస్మరిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఆదరణ పనిముట్లు మూలన పడేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యం లో సోమవారం ప్ర భుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్‌ వద్ద పనిముట్లు పట్టుకుని, వినూత్న నిరసన తెలిపారు. గంటపాటు సాగిన నిరసనలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ బడుగులను ఓట్లకోసం వాడుకుంటున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించటంతో వేలాది పదవులు కో ల్పోవాల్సి వస్తోందన్నారు. బీసీలకు చిన్నచిన్న పో స్టులి చ్చి, పెద్దవన్నీ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి కట్టబె ట్టారన్నారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన ఆదరణ పనిముట్లను వైసీపీ అధికారం చేప ట్టాక పంపిణీ చేయకుండా మూలన పడేయడం దుర్మార్గమన్నారు. కా ర్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు లేవన్నారు. కనీసం పాలకవర్గానికి కుర్చీలు లేవన్నారు. దీనిని బట్టే బీసీల పట్ల వైసీపీ ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తుందన్నారు. వెంటనే ఆదరణ పనిముట్లు పంపిణీ చేయాలనీ, కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హె చ్చరించారు. కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ జిల్లా నాయకులు వెంకటే్‌షగౌడ్‌, బీసీ సెల్‌ నేతలు కాకర్ల ఆదినారాయణ, సర్దార్‌ వలీ, చౌడయ్య, ఆంజనేయులు, నారాయణ, రాము, బాలాయాదవ్‌, కొండయ్య, వడ్డే ప్రసాద్‌, వడ్డే సుంకన్న, దళవాయి రామకృష్ణ, మురళి, మంజునాథ్‌, ప వన్‌, మారుతీగౌడ్‌, రామాంజి, ధనుంజయ, వెంకటరమణ, నగే్‌ష, విజయ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T06:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising