ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ABN, First Publish Date - 2020-03-16T10:25:18+05:30

సీపీఐ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గెలిచే ధైర్యం లేక బెదిరింపులతో 

అరాచకాలు సృష్టిస్తారా?

వైసీపీ నాయకుల్లారా! ఖబడ్దార్‌..!

కేతిరెడ్డీ..మీ నాయకులను అదుపులో పెట్టుకోండి

సీపీఐ ఆగ్రహం...పోలీసులకు ఫిర్యాదు


ధర్మవరం, మార్చి 15: ‘ఏయ్‌..నేనంటే ఎవరనుకున్నావ్‌.. ఎంత దైర్యంగా నామినేషన్‌ వేశావ్‌.. నోరుమూసుకుని ఉపసంహరించుకో’ అంటూ సీపీఐ  చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యకాదర్శి, 4వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి జింకాచలపతిపై వైసీపీ అభ్యర్థి జేసీబీ రమణ దాడికి దిగాడు. ఈ సంఘటన ప్రజలు, పోలీసుల సాక్షిగా ఆదివారం జరిగింది. ఈ హఠాత్తుపరిణామం నుంచి తేరుకునేలోపే ఆయనపై చే యి చేసుకున్నాడు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసేహక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని, చేతనైతే ప్రజల ఓట్ల ద్వారా గెలుపొందాలే తప్ప ఇలా దౌర్జన్యం చేస్తే ఎలాగని ప్రశ్నించడంతో వైసీపీ అభ్యర్థి మరింత రెచ్చిపోయాడు. దీంతో అక్కడున్నవారు కలుగజేసుకుని అక్కడి నుంచి ఆయనను పంపించి వేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలు అధికారపార్టీ తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వీధి రౌడీల బెదిరింపులకు కమ్యూనిస్టు పార్టీలు భయపడవన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి మధు మాట్లాడు తూ ‘వైసీపీ నాయకుల్లారా! ఖబడ్దార్‌.. బెదిరించి గెలవాలనుకోవడం మీ నీచ సంస్కృతికి నిదర్శనం. పోలీసుల ఎదుటే సీపీఐ అభ్యర్థి జింకా చలపతిపై దాడి చేశారంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లా?’ అంటూ  ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఆ పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోవాలన్నారు. ఓటమి భయంతో బెదిరిస్తే బెదరబోమని, తాము కమ్యూనిస్టులమనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటు అడిగే ఽధైర్యం లేక.. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ప్రతిపక్షాలపై వైసీపీ రౌడీలు దాడులకు దిగుతున్నారన్నారు. బాధితుడు జింకా చలపతి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేస్తున్న తనపై దాడిని ప్రతిఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతనా ఉందన్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీసుల ఎదుటే దాడులు, హెచ్చరికలకు దిగే పరిస్థితి ధర్మవరంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశా రు. అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేసే క మ్యూనిస్టులపై ఓ వీధిరౌడీ దాడికి తెగబడ్డాడంటే.. అది ఎవ రి ప్రమేయంతో జరిగిందో ప్రజలు తెలుసుకోవాలన్నారు. జే సీబీ రమణ లాంటి వీధిరౌడీకి బెదిరి పోటీ నుంచి పారిపో యే రకం తాను కాదన్నారు. ధర్మవరం ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వీధిరౌడీలకు ఓటు ద్వారా బుధ్ధి చెప్పాలన్నారు.


పోలీసులకు ఫిర్యాదు

4వ వార్డు వైసీపీ అభ్యర్థి జేసీబీ రమణ తనపై దాడి చేశారని అదే వార్డు సీపీఐ అభ్యర్థి జింకాచలపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ప్రజల ఎదుటే తనపై దౌర్జన్యం చేసిన ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఐ కరుణాకర్‌ను కోరారు.

Updated Date - 2020-03-16T10:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising