ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదోడి సొంతింటి కల నిజం చేస్తాం

ABN, First Publish Date - 2020-12-28T05:59:44+05:30

ప్రతి పేదవాని సొంతింటికల నిజం చే యడమే ముఖ్యమంత్రి ధ్యేయమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి శంకరనారాయణ 

సోమందేపల్లి(పెనుకొండ), డిసెంబరు 27:  ప్రతి పేదవాని సొంతింటికల నిజం చే యడమే ముఖ్యమంత్రి ధ్యేయమని రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నా రు. ఆదివారం మండలంలోని చాకర్లపల్లి గ్రా మంలో 805మందికి ఇంటిపట్టాలు పంపిణీ చే శారు. మంత్రి మాట్లాడుతూ నవరత్నాల్లో భా గంగా ఇంటిపట్టాలు ఇచ్చి పక్కాగృహాలు నిర్మిస్తున్నామన్నారు. నిరుపేదల సొంతింటికలను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగడుగునా అ డ్డంకులు సృష్టించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వలంటీర్ల ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి పార్టీలకు అ తీతంగా సం క్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. మొదటి విడతలో అర్హులైన వారికి ఇంటిపట్టాలు రా కపోతే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ప ట్టా మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ నిషాంతి, హౌసింగ్‌ ఈఈ చంద్రమౌళి రెడ్డి, డ్వామాఏపీడీ శివానందనాయక్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీఓ నాగరాజరావు, హౌసింగ్‌ డీ ఈ నాగరాజు, మం డల కన్వీనర్‌ వెంకటరత్నం, బీసీ ఈశ్వరయ్య, డీసీ అశోక్‌, నారాయణరెడ్డి, లక్ష్మీనరసప్ప, ఈశ్వర య్య, ఆదినారాయణరెడ్డి, కిష్టప్ప, సింగిల్‌విండో చైర్మన కొల్లప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising