ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు యాంత్రీకరణ కు సబ్సిడీ వర్తింపు

ABN, First Publish Date - 2020-07-09T09:57:59+05:30

యంత్రీకరణకు ఎట్టకేలకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాకు కేటాయించని లక్ష్యం

అన్నదాతలకు తప్పని నిరీక్షణ


అనంతపురం వ్యవసాయం, జూలై 8: యంత్రీకరణకు ఎట్టకేలకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందించలేదు. తాజాగా యాంత్రీకరణకు సబ్సిడీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాంత్రీకరణ పరికరాల రకాలకు అనుగుణంగా కొన్నింటికి 40, మరికొన్నింటికి 50 శాతం సబ్సిడీ వర్తింపజేశారు.


యాంత్రీకరణ పరికరాల మంజూరుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహరిస్తారు. మెంబర్‌ సెక్రటరీగా వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, సభ్యులుగా వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్‌ లేదంటే రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మెంబర్‌ సెక్రటరీగా జేడీఏ, కో మెంబర్‌ సెక్రటరీగా ఉద్యాన శాఖ డీడీ, సభ్యులుగా కేవీకే, నాబార్డు, అనుబంధ శాఖల అధికారులు వ్యవహరిస్తారు.


జిల్లాకు కేటాయించని లక్ష్యం

ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వ్యవసాయ శాఖ తరపున యాంత్రీకరణ లక్ష్యాన్ని నిర్ధేశిస్తారు. ఈ ఏడాది నీటికీ లక్ష్యంతోపాటు నిధులు మంజూరు చేయకపోవటం గమనార్హం. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేయకపోవటంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఎట్టకేలకు సబ్సిడీని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సబ్సిడీని వర్తింపజేయటంతోపాటు కరువు జిల్లాలో రైతులకు త్వరగా యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - 2020-07-09T09:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising