ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీల్లో నిరంకుశ ధోరణి తగదు

ABN, First Publish Date - 2020-12-11T06:20:54+05:30

రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిరంకుశ ధోరణిలో బదిలీలు చేయాలనుకోవటం త గదనీ, పారదర్శకంగా చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

పికెటింగ్‌లో మాట్లాడుతున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఖాళీలన్నింటినీ చూపాలి

ఫ్యాప్టో పికెటింగ్‌లో సంఘాల నాయకులు


అనంతపురం విద్య, డిసెంబరు 10: రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిరంకుశ ధోరణిలో బదిలీలు చేయాలనుకోవటం త గదనీ, పారదర్శకంగా చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో పిలుపు మేరకు స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద గురువారం పికెటింగ్‌ నిర్వహించారు. పలు సం ఘాల రాష్ట్ర, జిల్లా నాయకులతోపాటు, వందలాది మంటి టీచర్లు తరలివచ్చారు. ఫ్యాప్టో ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశ ధోరణిలో బదిలీలు చేయాలనుకుంటోందన్నారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యువల్‌గా చేపట్టాలన్నారు. ఆప్షన్‌ ఇవ్వటంలో టీచర్లు తీవ్ర మానసిక ఆందోళన పడాల్సి వస్తోందన్నారు. ఇప్పటి వరకూ బ్లాక్‌ చేసిన ఖాళీలన్నింటినీ వెంటనే చూపాలని కోరారు. విద్యార్థుల నమోదు క్రమంలో మీడియం మార టం వ ల్ల హేతుబద్ధీకరణలో రద్దయిన పోస్టులను వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బదిలీలు పారదర్శకంగా సాగేలా చూడాలని కోరా రు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సూర్యుడు, కో చైర్మెన్‌ మహమ్మద్‌ రఫీ, లక్ష్మీనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శులు వెంకటరత్నం, పెద్దన్న, కోశాధికారి లింగమూర్తి, నరసింహులు, జిలాన్‌, కులశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, త్రి మూర్తి, రమణయ్య, సరళ, చంద్రశేఖర్‌, వెంకటరెడ్డి, సుధాకర్‌, గోపాల్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, సుధాకర్‌, రమణారెడ్డి, శంకరమూర్తి, రాజశేఖర్‌, తిప్పన్న పాల్గొన్నారు.




Updated Date - 2020-12-11T06:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising