ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లు నడిపేదెలా ?

ABN, First Publish Date - 2020-06-02T09:45:56+05:30

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చినా అన్ని రైళ్లు ప ట్టాలెక్కే మార్గం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాకను అడ్డుకుంటున్న తెలంగాణా, ఒడిసా

ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు


అనంతపురం రైల్వే, జూన్‌ 1 :  కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చినా అన్ని రైళ్లు ప ట్టాలెక్కే మార్గం కానరావడం లేదు. కొన్ని రాష్ట్రాలు రైళ్ల ప్రయాణానికి అంగీకరించకపోవడమే ప్రధానకారణగా తోస్తోంది. ఇప్పటికే బెంగళూరు నుండి న్యూఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు నుంచి ముంబై వెళ్లే ఉ ద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కాయి. మరిన్ని రైళ్లను బెంగ ళూరు నుంచి అనంతపురం స్టేషన్‌ మీదుగా నడపడానికి యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది. అయితే పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డటంతో వీటికి విఘాతం కలుగుతోంది. మచ్చుకు కొన్ని పరిశీలిస్తే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు పునరుద్ధరించాలని ఏపీ ప్రజల నుంచి డిమాండ్‌ ఉంది.


అయితే తెలంగాణా ప్రభుత్వం సమ్మతించడం లేదు. బెం గళూరు నుంచి కాచిగూడకు వెళ్లే కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ నడపడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు అంగీకరి స్తున్నా తెలంగాణ ఒప్పుకోవడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే బెంగళూరు నుంచి భువనేశ్వర్‌ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రాకను ఒడిసా ప్రభుత్వం తిరస్క రిస్తోంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నడపడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సమ్మతంగా ఉండటంతో బెంగళూరు నుండి విశాఖపట్నం వరకు రాకపోకలు సాగించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో ఈ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్యలోనే రాకపోకలు సాగించేది. రైల్వే అధికారులు అందుకు అనుగుణంగా తగిన చర్యలు చేపడితే బాగుంటుందని ప్రయాణికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-02T09:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising