ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాళ్లు కొట్టే వారికి బియ్యం కార్డులు ఇవ్వండి

ABN, First Publish Date - 2020-04-04T10:20:35+05:30

మండల పరిధిలోని రాచువారిపల్లి వద్ద రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్న కూలీలను ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి శుక్ర వారం పలకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి


తనకల్లు, ఏప్రిల్‌ 3 : మండల పరిధిలోని రాచువారిపల్లి వద్ద రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్న కూలీలను ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి శుక్ర వారం పలకరించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలవుతున్నా ప్రస్తుతానికి తమకేమీ ఇబ్బంది లేదని బి య్యం కార్డులు, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. దీంతో ట్రైనీ కలెక్టర్‌ వెంటనే బియ్యం కార్డులు, పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ, ఆర్‌ఐ మల్లికార్జున ఉన్నారు. అలాగే కొక్కంటిక్రా్‌సలో పానీపూరీ వ్యాపారం చేసుకుం టున్న వీరేంద్రసింగ్‌ కుటుంబానికి తహసీల్దార్‌ సుబ్బలక్ష్మమ్మ, ఎస్‌ఐ రంగడు నిత్యావసర సరుకులు బియ్యం, బేడలు, సరుకులను అందించారు.


వలస కూలీలను ఆదుకోండి : ట్రైనీ కలెక్టర్‌

అమడగూరు, ఏప్రిల్‌ 3: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వలస కూలీలను ఆదుకోవాలని ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గాజులపల్లి గ్రామానికి గతంలో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన 40 కుటుంబాల వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ, సహకారాలు పర్యవేక్షించడానికి ట్రైనీ కలెక్టర్‌ జాహ్నవి మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్‌ వలస కూలీల వివరాలను ఆరాతీసి, పభుత్వం నుంచి అందుతున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-04-04T10:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising