ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణం లాక్‌.. సహనం డౌన్‌

ABN, First Publish Date - 2020-05-28T08:52:01+05:30

రాష్ట్రమంతా పలు రకాల సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉందని హిందూపురంలో మాత్రం నేటికీ సంపూర్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హిందూపురంలో  67 రోజులుగా సంపూర్ణ లాక్‌డౌన్‌
  • ఆగని కరోనా.. కుదుటపడని జనజీవవం
  • లక్షల మంది ఇళ్లకే పరిమితం
  • మానసిక ఒత్తిడిలో పట్టణ ప్రజలు
  • వివిధ రంగాలు కుదేలు.. ఉపాధి ప్రశ్నార్థకం
  • ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవన్న జనం


హిందూపురం, మే 27: రాష్ట్రమంతా పలు రకాల సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉందని హిందూపురంలో మాత్రం నేటికీ సంపూర్ణ లాక్‌డౌన్‌ను  కొనసాగిస్తున్నారు. 67 రోజులుగా పట్టణ ప్రజలు ఇళ్లకే పరిమితమైపోవడంతో  జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. లాక్‌డౌన్‌ విధించి రెండు నెలలు దాటినా హిందూపురంలో కరోనా ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగుతుండ టంతో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. మంగళవా రం రెడ్‌జోన్‌ అయిన ముక్కిడిపేటలో జనం రోడ్డుపైకి వచ్చి నిర్బంధంపై ఆందోళనకు దిగారు. ఇదే స్థాయిలోనే పట్టణమంతా ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికార యంత్రాంగం నెలల తరబడి జనాన్ని నిర్బంధించడం, కరోనా టెస్టింగ్‌ శాంపుల్స్‌ తగ్గించడం, కాంటాక్ట్‌ గుర్తింపు  విఫలమవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి లాక్‌డౌన్‌తో పట్టణంలోని అన్నివర్గాల జీవన విధా నం, ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే చాలా కాలనీల్లో మానసిక ఒత్తిడితో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం లాక్‌ డౌన్‌ను ఎప్పుడు సడలిస్తారోనని ప్రజలు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.


ఇలా ఇంకెన్నాళ్లు?

పట్టణంలో మార్చి 29న కరోనా తొలి కేసు నమోదైంది. అప్పటి నుంచి పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరిగాయి. దీంతో పట్టణంలో రెండు నెలల్లో 24 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పడ్డాంుు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం పట్టణ మంతా కంటైన్మెంట్‌ జోన్‌గా పరిగణించి నిర్బంధం కొన సాగిస్తోంది. వైరస్‌ కొత్త కాలనీలకు విస్తరిస్తూ రెడ్‌జోన్ల చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్లు  ఆరెంజ్‌ జోన్లుగా మారే పరిస్థితి ఇప్పట్లో కన్పించడం లేదని అధి కార వర్గాలు పేర్కొంటున్నాయి. రెడ్‌జోన్లలో ఎవరూ బయటికి రాకుండా వీధుల చుట్టూ బారికేడ్ల ఏర్పాట్లతో జనం రెండు నెలలుగా మానసిక వేదన చెందుతున్నారు. ఇలా ఇంకెన్నాళ్లు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-05-28T08:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising