ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఉగాది.. ఆలయ దర్శనాలు రద్దు

ABN, First Publish Date - 2020-03-25T11:15:57+05:30

ఉగాది పర్వదినం బుధవారం రోజున జిల్లాలో ఎక్కడా ఆలయ దర్శనాలకు అనుమతి లేదని దేవదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ రామాంజనేయులు మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భక్తులను అనుమతిస్తే చర్యలు : సహాయ కమిషనర్‌



అనంతపురం టౌన్‌, మార్చి 24 : ఉగాది పర్వదినం బుధవారం రోజున జిల్లాలో ఎక్కడా ఆలయ దర్శనాలకు అనుమతి లేదని దేవదాయ ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ రామాంజనేయులు మంగళవారం తెలిపారు. కరోనా వైర్‌సను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని రద్దు చేసినట్లు చెప్పారు.


ఉగాది పండుగ రోజున కూడా ఆలయాల్లోకి భక్తుల ప్రవేశం ఉండబోదని, కేవలం పురోహితులు మాత్రమే ప్రతిరోజూలాగే పూజాది కైంకర్యాలు నిర్వహించి పం చాంగ పఠనం చేస్తారన్నారు. భక్తులెవరూ ఆలయాలకు వెళ్లకూడదని, ఎవరైనా ఆలయంలోకి భక్తులను అనుమతించినట్లు తెలిస్తే సదరు ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తులు ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబసభ్యుల సమక్షంలో ఉగాది జరుపుకోవాలని కోరారు.

Updated Date - 2020-03-25T11:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising