ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు సహించం : టీడీపీ

ABN, First Publish Date - 2020-12-17T06:48:49+05:30

టిడ్కో ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, అన్యాయాలను సహించబోమని టీడీపీ నాయకులు అన్నారు.

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తాడిపత్రి, డిసెంబరు 16 : టిడ్కో ఇళ్ల కేటాయింపులో అక్రమాలు, అన్యాయాలను సహించబోమని  టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్‌ ఇన్‌ఛార్జ్‌ కమీషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ. టిడ్కో ఇళ్ల మంజూరులో అనేక అక్రమాలు చోటుచేసుకొని అర్హులకు మొండిచేయి చూపుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదటి, రెండవ విడతల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు జరగడంలో అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో డీడీలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి బదులు మరికొందరిని ఎంపిక చేశారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఈ పనికి ఒడిగట్టారన్నారు. అర్హులైన వారందరిని ఎంపిక చేయకుంటే ఈనెల 21న మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఐటీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ సోమశేఖర్‌నాయుడు, టీడీపీ నాయకులు రాబర్ట్‌, జక్కా రమేష్‌, రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-12-17T06:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising