ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి నగరంలో లాక్‌డౌన్‌ మరింత కఠినం

ABN, First Publish Date - 2020-07-14T11:18:14+05:30

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినం అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయం 6 నుంచి 11 గంటల వరకు అనుమతి..

అనవసరంగా రోడ్లపైకి వస్తే జరిమానా: జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు 


అనంతపురం క్రైం, జూలై 13 : కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత కఠినం అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నగరంలోకి అనుమతిస్తామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, తదితర అత్యవసర సేవలకు సంబంధించి ఉదయం 11 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు.


ఈ సమయంలో కూడా స్వీయ జాగ్రత్తలు పాటించడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. ఎవరైనా  రోడ్లపైకి వచ్చి బలాదూర్‌గా తిరిగినా, గుంపులుగా కనిపించినా, మాస్కులు ధరించకపోయినా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఉదయం 11 గంటల తరువాత మెడికల్‌ ఎమర్జెన్సీ, అత్యవసర సేవలు మినహా బయటకు వస్తే సహించమన్నారు.  పోలీసులు, నగరపాలక సంస్థ విభాగాల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలచే నిఘా ఉంచామన్నారు. నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిస్తే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-14T11:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising