ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం అన్నింటా నైతికంగా ఓడిపోయింది

ABN, First Publish Date - 2020-05-30T10:11:04+05:30

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు


రాయదుర్గం, మే 29 : నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే రాజీనా.మా చేసి దిగిపోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. రాయదుర్గంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యతను భుజస్కంధాలపై మోస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఇప్పటికైనా జగన్‌ చర్యలకు వత్తాసు పలకకుం డా చట్టవ్యతిరేక చర్యలను ఆదిలోనే అడ్డుకోవాలని విన్నవించారు. ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘించి, నియమాలను కాలరాస్తే ప్రభుత్వ చర్యకు అధికారులందరు గుడ్డిగా సహకరించారన్నారు. ఇప ట్పటికైనా ఉన్నతాధికారులంతా ఆత్మవిమర్శ చేసుకోవాలని, చేసిన రాజ్యాంగ విరుద్ధ చర్య వల్ల చదువుకున్న చదువులకు, సంపాదించుకున్న విజ్ఞానానికి కోర్టులో తగిలిన ఎదురుదెబ్బపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.


జగన్‌ చర్యలను సమర్థిస్తే మరిన్ని చేదు అనుభవాలు రావడంతో పాటు పరిణామాలు ఏ విధంగా ఉంటా యో చెప్పలేని పరిస్థితి అన్నారు. ఎక్కడో ఒక చోట న్యాయానికి, ధర్మానికి చోటు ఉండి ఆ రెండింటికీ రక్షణ ఉంటుందన్నారు. అలాం టి రక్షణ బాధ్యతలను న్యాయస్థానాలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. నైతికంగా జగన్‌ ప్రభుత్వం ప్రతి అడుగులోను ఓడిపోయిందని, రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ను అక్రమంగా తొలగించడం ద్వారా అనైతిక చర్యకు, రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడిందని, కోర్టు తీర్పు నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-30T10:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising