ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుణ్యభూమి మనదేశం

ABN, First Publish Date - 2020-12-27T06:23:27+05:30

ప్రపంచంలో అత్యంత పుణ్యప్రదమైన భూమి భారతదేశమేననీ, మరే దేశంతోనూ పోలిక లేదని పుష్పగిరి శారదా లక్ష్మీనృషింహ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య నృసిం హ భారతిస్వామి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం టౌన్‌, డిసెంబరు 26: ప్రపంచంలో అత్యంత పుణ్యప్రదమైన భూమి భారతదేశమేననీ, మరే దేశంతోనూ పోలిక లేదని పుష్పగిరి శారదా లక్ష్మీనృషింహ పీఠాధిపతి పరమహంస పరివ్రాజకాచార్య నృసిం హ భారతిస్వామి అన్నారు. జిల్లా కేంద్రానికి శని వారం సాయంత్రం విచ్చేసిన ఆయనకు సోమనాథ్‌నగర్‌లో వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి తొలు త వినాయక ఆలయాన్ని సదర్శించి, సోమనాథ్‌నగర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి నాగరాజారావు నివాసంలో నిర్వహించిన సామూహిక విష్ణుసహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం ప్రశాంతినగర్‌లో వేదమాత గాయత్రి దేవాలయంలో భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. విష్ణుసహస్రనామ పారాయణం మనిషిని అత్యున్నతుడిని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం తపోవనం చిన్మయా జగదీశ్వరాలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో శృంగేరి విరూపాక్ష మఠం పీఠాధిపతి విద్యానృసింహభారతి స్వామి, చిన్మయా మిషన్‌ ప్రతినిధి ఆత్మవిదానంద సరస్వతి, సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్‌, ఎస్‌బీఐ విశ్రాంత చీఫ్‌ మేనేజర్‌ రవీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-27T06:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising