తప్పుతున్న జల‘కళ’
ABN, First Publish Date - 2020-12-29T06:54:50+05:30
జలకళ పథకంలో ఉచితంగా బోర్లు వేయిస్తారని ఆశలు పెట్టుకున్న చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. 2.50 ఎకరాలు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వం తాజా గా నిర్ణయం తీసుకుంది.
2.5 ఎకరాలుండే రైతులకే పథకం వర్తింపు
అంతకంటే తక్కువ భూమి ఉన్న వారి అర్జీలు వెనక్కి
జిల్లాలో 60 శాతం దరఖాస్తుదారులకు అన్యాయం
అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 28: జలకళ పథకంలో ఉచితంగా బోర్లు వేయిస్తారని ఆశలు పెట్టుకున్న చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. 2.50 ఎకరాలు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఉచిత బోర్లు వేయించాలని ప్రభుత్వం తాజా గా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సంబంధిత అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా జలకళ ద్వారా అర్హులందరికీ బోర్లు వేయించేలా ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా బోరు బావులకు నోచుకోని వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు ఎంతో ఆశతో దరఖాస్తు చే సుకున్నారు. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వా త వాల్టా చట్టం అడ్డువస్తుందన్న కారణంతో జలకళ నిబంధ నలను సడలిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజా మార్గదర్శకాల ప్రకారం రెం డున్నర ఎకరాల భూమి ఉన్న రైతుల ను మాత్రమే పథకానికి అర్హులుగా నిర్ణయించా రు. అంతకంటే తక్కువ విస్తీర్ణం భూమి కలిగిన రైతులు అనర్హులు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చిన్న, సన్నకారు రైతులు బృందాలు గా ఏర్పడి మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వా రి లో ఒకరి పొలంలో బోరు వేసేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తక్కువ భూమి ఉన్న అర్జీలు వెనక్కి
కొత్త నిబంధనల మేరకు రెండున్నర ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులను పథకంలో అనర్హులుగా గుర్తించనున్నారు. జిల్లా వ్యాప్తంగా జలకళ పథకంలో 25వేల మంది దాకా రైతులు ఉచిత బోర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక అధికారులు వారందరికీ ఉచిత బోర్లు మంజూరు చేస్తూ అనుమతులు మంజూరు చేశారు. ప్రభుత్వం కొత్త ని బంధనలు అమలు చేయడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులను అర్హత జాబితా నుం చి తొలగించనున్నారు. జిల్లాలో ఇప్పటి దాకా దరఖాస్తు చేసుకున్న రైతుల్లో 60 శాతం చిన్న,సన్నకారు రైతులే ఉండటం గమనార్హం. ప్రభుత్వ తాజా నిర్ణయం తో చిన్న, సన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాల్టా పేరుతో సంఖ్య తగ్గించే యత్నం
వాల్టాచట్టం మేరకు జలశయాలు, చెరువుల ఆయకట్టు ప్రాంతాల్లో రెండు వ్యవసాయ బో రు బావుల మధ్య 200 మీటర్ల దూరం ఉం డాలి. ఆయకట్టేతర భూముల్లో 300 మీటర్ల దూరం తప్పనిసరిగా పాటించాలి. జిల్లాలో ఇ ప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న చిన్న,సన్నకారు రైతుల్లో వాల్టాచట్టానికి లోబడి ఎంత మంది రైతులకు బోర్లు వేయవచ్చు..? ఎంత మంది రైతులకు బోర్లు వేయకూడదన్న సమాచారం సేకరించకుండా ప్రభుత్వం కొత్త నిబం ధనలు తెరపైకి తేవడం అన్యాయమం టూ బాధిత రైతులు వాపోతున్నారు. జలకళ పథకంలో వాల్టాచట్టానికి లోబడి బోర్లు వేసేందుకు అవకాశం ఉంటేనే అర్హత జాబి తాలోకి చేరుస్తారని, అలాంటప్పుడు రెండున్నర ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉంటే అర్హులుకారంటూ వింత నిబంధనలు అమలు చేయడం భావ్యం కాదంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి వాల్టా చట్టానికి లో బడి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వారి పొలాల్లోనే ఉ చిత బోర్లు వేయించేలా ప్రభుత్వం చర్యలు తీ సుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకే..
వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ
జలకళ పథకంలో రెండున్న ఎకరాలకంటే త క్కువ విస్తీర్ణం కలిగిన చిన్న, సన్నకారు రై తులు అనర్హులుగా ప్రభుత్వం కొత్త నిబంధన లు అమలు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అలాంటి రైతుల అర్జీలను తిరస్క రించాలని అధికారులను ఆదేశించాం. తక్కువ వి స్తీర్ణం కలిగిన రైతులు బృందాలుగా ఏర్పడి మ ళ్లీ దరఖాస్తు చేసుకుంటే జియాలజిస్టు సూచన మేర కు ఒక రైతు పొలంలో ఉచిత బోరు వేయి స్తాం. ప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు ముందుకు వెళతాం.
Updated Date - 2020-12-29T06:54:50+05:30 IST